నెల్లూరు జిల్లా వెంకటగిరిలో అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ ప్రతీప్ కుమార్ పర్యటించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇటీవల అటవీశాఖతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారని ప్రతీప్కుమార్ అన్నారు. ఈ క్రమంలోనే ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని సీఎం ఆదేశించినట్టు వివరించారు. అటవీశాఖలో క్షేత్రస్థాయి సిబ్బంది 60 శాతం భర్తీ కావాల్సి ఉందన్నారు. వచ్చే జనవరిలో ఈ ఉద్యోగాల భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. లంచం తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎర్రచందనం అక్రమ రవాణాపై అటవీశాఖ ఉక్కుపాదం - నెల్లూరు జిల్లా వెంకటగిరి
జాతీయ అటవీ పాలసీ ప్రకారం భూభాగంలో 33 శాతం చెట్లను పెంచే దిశగా అటవీశాఖ చర్యలు తీసుకుంటుందని అటవీశాఖ అధికారి ప్రతీప్ కుమార్ తెలిపారు.
ఎర్రచందనం అక్రమరవాణాపై అటవీశాఖ ఉక్కుపాదం