నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రానికి విదేశీ పక్షుల ఆగమనం మొదలైంది. నైజీరియా, ఇండోనేషియా, ఖజికిస్తాన్ వంటి ఇతర దేశాల నుంచి పక్షులు చేరుతున్నాయి. ఇక్కడి చెరువులోని చెట్లపై సేదతీరుతూ...గూళ్లు కట్టుకుంటున్నాయి. మరో వైపు జింకల పార్కు, పిల్లల పార్కులను ఆకర్షణీయంగా తీర్చి దిద్దుతున్నారు. సందర్శకులకు మరుగుదొడ్లు ఇతర వసతులు కల్పిస్తున్నారు. పర్యాటకులు రాకపోకలకు సౌకర్యాలను చేస్తున్నారు అక్కడి సిబ్బంది.
నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రానికి విదేశీ పక్షుల రాక ..... - Foreign birds arriving at doravarisatram bird sanctuary at nellore.
దొరవారిసత్రం మండలం నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రానికి విదేశీ పక్షుల రాక మొదలైంది. పక్షులు సందడిని చూడటానికి ఆ ప్రాంతంలో పర్యాటకుల తాకిడి అధికం కానుంది.
Nigeria, Indonesia, Kazakhstan