ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సమాజ హితులే.. ఆరోగ్యవంతులు! - india fights carona

కరోనా కలకలం.. రకరకాల మనుషులను, రకరకాల మనస్తత్వాలను పరిచయం చేస్తోంది. ఎంత అప్రమత్తం చేసినా ఏ మాత్రం పట్టింపు లేక వైరస్ వ్యాప్తికి కారణమయ్యే వారితో పాటు.. తమంతట తాముగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకుని.. అందరి హితం కోసం పాటుపడే వారినీ సమాజానికి పరిచయం చేస్తోంది. మంచిని పాటిస్తే.. చెడును తరమవచ్చన్న సందేశాన్ని పంచుతోంది.

nellore district
ఎవరికి వారు స్వీయ నిర్బంధం

By

Published : Apr 2, 2020, 3:38 PM IST

ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో బుధవారం ఒక్క రోజే 2 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గత నెలలో దిల్లీలో జరిగిన ప్రార్థనా సమావేశాలకు వెళ్లి వచ్చిన వారిలో కొందరు తమకు తాము స్వీయ నిర్బంధం పాటించక, ప్రయాణం గురించి సమాచారం ప్రభుత్వానికి తెలియచేక.. భారీ విపత్తుకు కారణమయ్యారు. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించడం, వారికి స్వీయనిర్బంధం ఏర్పాటు చేయడంలో క్షేత్రస్థాయి నుంచి ఉన్నతస్థాయి వరకు అధికారుల వరకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారు తమతో పాటు కుటుంబాలు, తమ చుట్టు పక్కల సమాజం బాగు గురించి ఏమాత్రం ఆలోచించడం లేదనే వెల్లడవుతుంది. ఇదే సమయంలో కొందరు మాత్రం అధికారులు చెప్పక ముందే తమతో పాటు సమాజ హితం కోసం తమకు తామే స్వీయనిర్బంధం ఏర్పాటు చేసుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటున్నారు.

ఆమె అందరి కన్నా ముందుగా ..

సంగంకు చెందిన ఓ మహిళ కెనడాలో ఉన్న కుమార్తె వద్దకు గతేడాది వెళ్లారు. అక్కడి నుంచి గత నెల పదో తేదీన స్వగ్రామానికి వచ్చారు.ఆమె తిరుగు పయనమయ్యేసరికే కెనడాలో కరోనా బీభత్సం ప్రారంభమై ఉంది. దీంతో విమానాశ్రయం నుంచే కుటుంబ సభ్యులకు సమాచారమందించారు. అందరూ ఇంటిని విడిచి వెళ్లాలని, తాను ఒక్కదానినే అందులో ఉంటానని చెప్పారు. వారు విస్తుపోయి మొదట ఆవేదనకు గురయినా నిర్ణయం మారలేదు. ఈమె రాక గురించి వైద్య ఆరోగ్యశాఖకు సమాచారం లేదు. ఆలస్యంగా తెలిసి అక్కడకు వెళ్లారు. స్వీయనిర్బంధంలో సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న ఆమెను పరిశీలించి ప్రశంసించారు. అప్పటి నుంచి నిరంతరం వైద్య పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.

నలుగురు కుటుంబసభ్యులు నిర్బంధంలోనే

కోలగట్ల గ్రామానికి చెందిన ఓ యువకుడు లండన్‌లో సాఫ్ట్‌వేర్‌ నిపుణుడిగా పని చేసే వారు. గత నెలలో స్వగ్రామానికి వచ్చారు. వెంటనే భార్య, ఇద్దరు పిల్లలతో కలసి ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉన్నారు. వైద్య సిబ్బంది పరిశీలించి సంతోషించారు.

జర్మనీ నుంచి చెన్నైకి వచ్చినా...

కోలగట్ల గ్రామానికి చెందిన వేరొక యువకుడు జర్మనీ నుంచి వచ్చి చెన్నైలో ఉన్నారు. ఈ సమాచారం సంగం వైద్య సిబ్బందికి చేరింది. వారు చెన్నైలో ఉన్న ఆ వ్యక్తికి ఐసోలేషన్‌ గురించి తెలిపారు. వెంటనే ఆయన చెన్నై నగరపాలక సంస్థ పర్యవేక్షణలో స్వీయ నిర్బంధం పాటించారు. ప్రస్తుతం కులాసాగా ఉన్నారు.

ఒమన్ నుంచి వచ్చి..

సంగం యువకుడు ఒమన్‌ నుంచి స్వగ్రామానికి వచ్చారు. వైద్య ఆరోగ్య శాఖ సూచనల ప్రకారం తన ఇంట్లోనే స్వీయ నిర్బంధం పాటిస్తున్నారు. చక్కటి ఆరోగ్యంతో ఉన్నారు.

ఇదీ చూడండి:

నెల్లూరు జిల్లా వాసికి కరోనా పాజిటివ్

ABOUT THE AUTHOR

...view details