నెల్లూరు జిల్లా సోమశిల జలాశయంలో వరదనీరు వచ్చి చేరుతోంది. వారం రోజుల నుంచి కడప, కర్నూలు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు భారీ ఎత్తున సోమశిల జలాశయానికి నీరు వస్తోంది. వారం రోజుల క్రితం 43 టీఎంసీల నీరు ఉండగా.. ప్రస్తుతం 52 టీఎంసీల నీటి మట్టానికి చేరుకుంది. ఈ సీజన్లో వరి పంట రైతులకు ఎటువంటి నీటి కొరత ఉండదని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. ఇంకా ఇలానే వర్షాలు కొనసాగితే జలాశయం పూర్తిగా నిండే అవకాశం ఉందన్నారు.
సోమశిల జలాశయానికి చేరిన వరద నీరు.. - Somshila Reservoir latest news
ఏకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా సోమశిల జలాశయం నిండుకుండలా మారింది. ప్రస్తుతం జలాశయంలో 52 టీఎంసీల నీటి మట్టానికి చేరుకుంది.
![సోమశిల జలాశయానికి చేరిన వరద నీరు.. Somshila Reservoir](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12541699-590-12541699-1626969956306.jpg)
సోమశిల జలాశయం