ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నివర్ తుపాను ఎఫెక్ట్: ముంపులోనే కాలనీలు - rain news nellore district

నివర్ తుపాన్ ప్రభావంతో పెన్నా నదికి వరద పోటెత్తింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. నెల్లూరులోని అనేక కాలనీలు జలదిగ్భంధంలోనే ఉన్నాయి.

నెల్లూరులో ఓ కాలనీలో నిలిచిన నీరు
నెల్లూరులో ఓ కాలనీలో నిలిచిన నీరు

By

Published : Nov 28, 2020, 5:29 PM IST

కాలనీలో వరద నీరు

నెల్లూరు జిల్లాలో నివర్ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిశాయి. పెన్నానదికి ప్రవాహం పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం ఆగని పరిస్థితుల్లో నెల్లూరులో అనేక కాలనీలు జలదిగ్భంధంలోనే ఉన్నాయి. పుత్తా ఎస్టేట్, మనుమసిద్ది నగర్, పొర్లుకట్ట ప్రాంతాలు నీట మునిగాయి. కొన్ని కాలనీల్లోకి ఆరుడుగలపైన నీరు నిలిచింది.

వందలాది ఇళ్లు నీట మునిగాయి. బాధిత ప్రజలను అధికారులు, స్థానిక యువత ఎడ్ల బండ్లు, ట్రాక్టర్ల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. కొందరు మిద్దెల మీదికి చేరి బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇళ్లలోని సామగ్రి తడిచి పోగా, వాహనాలు నీటిలోనే తేలియాడుతూ పాడైపోతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details