భారీ వర్షాల కారణంగా పెన్నా నదిలో వరద పోటెత్తుతోంది. దీంతో నెల్లూరు జిల్లా కోవూరు సమీపంలో 16 నంబరు జాతీయ రహదారి కోతకు గురైంది. నెల్లూరు నగరం దాటాక చెన్నై-కోల్‌కతా మార్గంలో రోడ్డు ధ్వంసమైంది. దీంతో విజయవాడ-నెల్లూరు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 5కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి.
FLOODS EFFECT IN AP: భారీ వరదల కారణంగా కోవూరు వద్ద కోతకు గురైన హైవే..! - వరదల కారణంగా కోతకు గురైన హైవే
నెల్లూరు జిల్లా భారీ వరదల కారణంగా(FLOOD EFFECT IN AP)... కోవూరు సమీపంలో 16వ నంబరు జాతీయ రహదారి(NATIONAL HIGHWAY DAMAGED) కోతకు గురైంది. చెన్నె-కోల్‌కతా మార్గంలో రోడ్డు ధ్వంసమవడంతో... వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
తిరుపతి నుంచి శ్రీకాళహస్తి మీదుగా వెళ్లే వాహనాలను పోలీసులు తొట్టంబేడు చెక్‌పోస్టు వద్ద నిలిపివేస్తున్నారు. దీంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు ఆగిపోయాయి. వాహనదారులు కడప, పామూరు, దర్శి వైపుగా వెళ్లాలని పోలీసులు సూచించారు. మరోవైపు ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఒంగోలు వైపు నుంచి నెల్లూరుకు రాకపోకలు బంద్ అయ్యాయి. దీంతో వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇదీ చూడండి:Papagni River:కమలాపురంలో పాపాగ్ని నదిపై కూలిన వంతెన