నివర్ తుపాను ప్రభావంతో పెన్నా నదికి వరద పోటెత్తుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. సోమశిల జలాశయం నుంచి 3 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తుండటంతో.. పెన్నా బ్యారేజీ వద్ద వరద ఉరకలేస్తోంది. ప్రస్తుతం లక్షా 50 వేల క్యుసెక్కుల నీరు వస్తుండగా.. సాయంత్రానికి 2.50 లక్షల క్యూసెక్కులకు ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. దీంతో లోతట్టు ప్రాంతవాసులు ఆందోళన చెందుతున్నారు.
పెన్నానదికి పోటెత్తిన వరద.. లోతట్టు ప్రాంతాలు జలమయం
పెన్నా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. సోమశిల జలాశయం నుంచి దిగువకు 3.50 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయటంతో..పెన్నా పరీవాహక ప్రాంతంలో పలు గ్రామాలను వరద ప్రవాహం చుట్టుముట్టింది.
flood to penna river due to nivar cyclone
పెన్నా పరీవాహక ప్రాంతంలో పలు గ్రామాలను వరద ప్రవాహం చుట్టుముట్టింది. అప్పారావుపాలెం, వీర్లగుడిపాడు, కోలగట్ల గ్రామాలు జలమయమయ్యాయి. ప్రజలను బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారుల ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండి: నివర్ ఎఫెక్ట్: 5 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు...వెయ్యి కోట్లకుపైగా నష్టం