నెల్లూరు సోమశిల జలాశయానికి వరద ప్రవాహం భారీగా చెరుతోంది. ఎగువన ఉన్న కడప, కర్నూలు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా యాభై వెల క్యూసెకుల వరద ప్రవాహం వస్తోంది.
ప్రస్తుతం జలాశయం నీటి మట్టం 60 టీఎంసీలు. పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు. ఉత్తర, దక్షిణ కాల్వల ద్వార కిందకు 12,000 క్యూసెకుల నీటిని కిందకు విడుదల చేశారు. ఈ వర్షాలకు సోమశిల జలాశయం నిండు కుండలాగ జలకళ సంతరించుకుంది.