ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పొంగి ప్రవహిస్తున్న స్వర్ణముఖి.. అధికారుల ముందస్తు జాగ్రత్తలు - flood flow in swarnamukhi river at nellore news update

నివర్ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. స్వర్ణముఖి నది పొంగి ప్రవహిస్తోంది. ముంపు గ్రామాల పరిధిలో రాకపోకలు నిషేధించేందుకు అధికారులు నిర్ణయించారు.

flood flow in swarnamukhi river
పొంగి ప్రవహిస్తోన్న స్వర్ణముఖి అధికారులు ముందస్తు జాగ్రత్తలు

By

Published : Nov 26, 2020, 11:49 AM IST

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేటను ఆనుకొని ప్రవహించే స్వర్ణముఖి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నివర్ తుపాను ప్రభావతంతో భారీ వర్షాలు కురవడం.. నది పరివాహక ప్రాంతాలు జలమయమయ్యాయి. నాయుడుపేట నుంచి వెంకటగిరికి రాకపోకలు నిలిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

నదికి ఇరువైపులా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి.. అటుగా ప్రయాణాలు చేయకుండా చర్యలు తీసుకున్నారు. అధికారులు తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలను ఎస్సై వెంకటేశ్వరరావు, డీఈ సుధాకర్​ పరిశీలించారు.

ABOUT THE AUTHOR

...view details