నెల్లూరు జిల్లాలో ఐదేళ్ల క్రితం వచ్చిన వరదలకు జాతీయ రహదారి పలుచోట్ల ధ్వంసమైంది. గూడూరు సమీపంలోని రోడ్డు కోతకు గురైంది. అప్పట్లో జాతీయ రహదారి అధికారులు తాత్కాలికంగా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టినా, శాశ్వత పరిష్కారం చూపలేదు. గత ఏడాది చివర్లో రూ.134 కోట్ల వ్యయంతో దెబ్బతిన్న రహదారిని నిర్మించేందుకు టెండర్లు పిలిచారు. ఈ ఏడాది ప్రారంభంలో కరోనా కారణంగా పనులు మందకొడిగా సాగాయి.
జాతీయ రహదారి మరమ్మతులకు మోక్షం
నెల్లూరు జిల్లాలో ఐదేళ్ల కిందట వచ్చిన వరదలకు గుడూరు సమీపంలో జాతీయ రహదారి దెబ్బతింది. అప్పట్లో తాత్కాలికంగా మరమ్మతులు చేశారు. గత ఏడాది రహదారి మరమ్మతులకు టెండర్లు పిలిచారు. ఈ ఏడాది ప్రారంభంలో పనులు మొదలుకావాల్సి ఉండగా కరోనా వల్ల నిలిచిపోయాయి. కరోనా కాస్త నెమ్మదించడంతో జాతీయ రహదారి పనులు తిరిగి మొదలయ్యాయి.
ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతుండటంతో ఆరు లైన్ల రోడ్డు నిర్మాణం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ధ్వంసమైన కల్వర్టులను తొలగిస్తున్నారు. ట్రాఫిక్‌ను దారి మళ్లించడంతో పాటు వేగ నిరోధకాలు ఏర్పాటు చేశారు. అలాగే భవిష్యత్తులో వరద తాకిడిని తట్టుకునేలా రోడ్డుకు ఇరువైపులా భారీ కాంక్రీట్ గోడను నిర్మిస్తున్నారు. చాలా ఏళ్ల నుంచి పెండింగ్‌లో పనులకు పరిష్కారం లభించిందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి :పోలీసుశాఖలో 58 సైంటిఫిక్ అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్