ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరు జిల్లాలో మంత్రుల పర్యటన....అభివృద్ధి పనులకు శ్రీకారం - minister goutham on nelore development

నెల్లూరు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసులరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతంరెడ్డి పర్యటించారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలోని సర్వేపల్లి, సూళ్లూరుపేట నియోజకవర్గాల పరిధిలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తిరుపతి పార్లమెంట్​ నియోజవర్గానికి జరిగే ఎన్నికల్లో గతం కన్నా అత్యధిక మెజారిటీతో వైకాపా అభ్యర్ధిని గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

నెల్లూరు జిల్లాలో మంత్రుల పర్యటన
నెల్లూరు జిల్లాలో మంత్రుల పర్యటన

By

Published : Dec 16, 2020, 7:38 PM IST

నెల్లూరు జిల్లాలో మంత్రుల పర్యటన....అభివృద్ధి పనులకు శ్రీకారం

నెల్లూరు జిల్లాలో బుధవారం ఐదుగురు మంత్రులు పర్యటించారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసులరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతంరెడ్డి జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. వెంకటాచలం మండలం జాతీయ రహదారిపై జల జీవన్ మిషన్​కు సంబంధించిన పైలాన్ ఆవిష్కరించారు. సర్వేపల్లి గ్రామంలో రూర్బన్ పనుల పైలాన్​ను ఆవిష్కరించారు.

పూడిపర్తిలో సచివాలయం, రైతు భరోసా కేంద్రాన్ని మంత్రులు ప్రారంభించారు. ఓజిలి మండలం వెంకటరెడ్డిపాలెంలో రూ.12 కోట్లతో నిర్మించిన ఏకలవ్య గురుకుల పాఠశాలు, నాయుడుపేటలో ప్రభుత్వ వైద్యశాల భవనాలను ప్రారంభించారు. సర్వేపల్లిలో వైకాపా శ్రేణులతో సమావేశం నిర్వహించారు. తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో వైకాపాను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ఇదీ చదవండి: అమరావతి: రేపు 'జనరణభేరి' భారీ బహిరంగ సభ

ABOUT THE AUTHOR

...view details