కర్నూలు జిల్లా కోస్గి గ్రామానికి చెందిన ఈరన్న, కోసిగయ్య, తాయన్న, హుసేన్లు.. ఆదోని మండలం నాగలాపురం గ్రామానికి చెందిన నరసన్న అనే వ్యక్తిని కొట్టి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. గత నెల 28న మండల కేంద్రంలో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న నరసన్న బహిర్భూమి కోసం సమీప పొలానికి వెళ్లాడు. నరసన్నను చూసి దొంగగా భావించిన నిందితులు అతడిని చితకబాదారు. ఈ ఘటనతో అస్వస్థతకు గురైన నరసన్న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టగా ఐదుగురిని అరెస్టు చేశారు.
హత్య కేసును ఛేదించిన పోలీసులు... ఐదుగురు అరెస్టు - kurnool district crime news
కర్నూలు జిల్లా కోస్గిలో జరిగిన హత్య కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గత నెల 28న ఆదోని మండలం నాగలాపురం గ్రామానికి చెందిన నరసన్న అనే వ్యక్తిని వీరు కొట్టి చంపినట్లుగా పోలీసులు నిర్ధరించారు.
హత్య కేసును ఛేదించిన పోలీసులు... అయిదుగురు అరెస్టు