చేపల రైతుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. మత్స్యశాఖ అధికారులు చేపల రైతుల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. దళారులు రైతులను మోసం చేస్తున్నా అధికారులు కనీసం వారిపై చర్యలు తీసుకోవట్లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల ఆవేదన..
నెల్లూరు జిల్లాలో తీర ప్రాంతాలలో విస్తారంగా రైతులు చేపల సాగు చేస్తారు. చేపల వ్యాపారులు రైతుల దగ్గర కిలో 80 రూపాయలకు కొనుగోలు చేస్తుండడంతో గిట్టుబాటు కావడం లేదని రైతులు లబోదిబోమంటున్నారు. వ్యాపారులు వారికి ఇష్టం వచ్చిన రేట్లకు కొనుగోలు చేస్తున్నారని... చేపల రైతులు చెబుతున్నారు. బహిరంగ మార్కెట్లో మాత్రం కిలో చేపల ధర 140 నుంచి 160 రూపాయల వరకు అమ్ముతున్నారని... రైతు దగ్గర మాత్రం వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాసిరకం ఫీడ్
నాసిరకం ఫీడు, కెమికల్స్ మార్కెట్లో వ్యాపారులు అమ్ముతున్నా మత్స్యశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేపలు పెరుగుదల కూడా రావడం లేదని వారు చెబుతున్నారు. జిల్లాలో నాసిరకం ఫీడ్ కెమికల్స్ రాజ్యమేలుతున్నా అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని వారు మండిపడ్డారు.