నెల్లూరు జిల్లాలోని రాజోలు గ్రామంలో చెరువులోని చేపలను దొంగిలించారని.. ఐదుగురు గిరిజనులపై చేపల చెరువు నిర్వాహకుడు దాడి చేశాడు. వారిలో వృద్ధులు వికలాంగులూ ఉన్నారు. కర్రలతో విచక్షణారహితంగా కొట్టడంతో తీవ్ర గాయాలపాలై కొందరు స్పృహ తప్పి పడిపోయారు. గిరిజనులు.. తాము కాపలా ఉండే.. తోట యజమానికి విషయం తెలపగా.. ఏఎస్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గోపాల్ తెలిపారు.
చేపలు దొంగిలించారని గిరిజనులను చితకబాదారు - news on attacks on tribals in nellore
తన చెరువులోని చేపలు దొంగిలించారని ఉద్దేశంతో... ఐదుగురు గిరిజనులపై కర్రతో దాడి చేశాడో చేపల చెరువు నిర్వాహకుడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా రాజోలులో జరిగింది.
![చేపలు దొంగిలించారని గిరిజనులను చితకబాదారు fish owner attacks on tribals](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7566874-218-7566874-1591850347528.jpg)
చేపల చెరువు నిర్వాహకుడి చేతిలో గాయపడిన గిరిజనులు
TAGGED:
నెల్లూరులో గిరిజనులపై దాడులు