నెల్లూరు జిల్లా తీరప్రాంతంలోని 12 మండలాల్లో 3200 ఎకరాలలో రైతులు చేపలు సాగు చేస్తున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో వారి బాధలు వర్ణనాతీతంగా మారాయి. వ్యాపారులు ఫీడ్ రేట్లు అమాంతంగా పెంచేశారు అని, మందుల దుకాణాలు తీయకపోవడంతో, సరైన టైంలో మేతలు ఇవ్వలేకపోతున్నామని రైతులు చెబుతున్నారు. చేపల మేత అందించే దుకాణాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు తెరిచి ఉంచే అవకాశం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.పోలీసులు అనేక నిబంధనలు విధిస్తుండడంతో వ్యాపారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధరలు కూడా భారీగా తగ్గిస్తున్నారు అని తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు అంటున్నారు.
లాక్ డౌన్ కారణంగా నష్టపోతున్న చేపరైతులు
నెల్లూరు జిల్లాలో చేప రైతుల పరిస్థితి అధ్వానగా మారింది.కరోనా కారణంగా చేపల ధర పడిపోవటంతో తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు.మరో వైపు చేపలకు వేసే మేతకు సంబంధించిన దుకాణాలు మూతపడటంతో వాటికి మేతలేక చనిపోతున్నాయని రైతులు వాపోతున్నారు.
లాక్ డౌన్ కారణంగా నష్టపోతున్న చేపరైతులు