కారులో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం - ap news
Fire in Car: నెల్లూరు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఉలవపాడు వద్ద జాతీయ రహదారిపై వెళ్తుండగా కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులోని నలుగురు వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రాణాలు రక్షించుకునేందుకు కిందకు దిగారు. దీంతో వారంతా సురక్షితంగా బయటపడ్డారు. వారు గుంటూరు నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మంటలార్పారు.
car