నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణ పరిధిలోని యస్.ఆర్.జె డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన టపాసుల దుకాణాలను ఆత్మకూరు రెవెన్యూ డివిజనల్ అధికారి సువర్ణమ్మ, మునిసిపల్ కమిషనర్ యం.రమేష్ బాబు తనిఖీలు చేశారు. దుకాణదారులు కొవిడ్ నిబంధనలను తప్పక పాటిస్తూ.. ప్రభుత్వం సూచించిన టపాసులు మాత్రమే అమ్మాలని తెలిపారు. కొనుగోలుదారులు భౌతికదూరం తప్పక పాటించేలా తగు జాగ్రత్తల తీసుకోవాలని సూచించారు.
టపాసుల దుకాణాల్లో కొవిడ్ నిబంధనలు తప్పక పాటించాలి - Nellore District Atmakuru News
శనివారం దీపావళి పండగ సందర్భంగా ఇప్పటికే జిల్లాలో పలు చోట్ల టపాసుల దుకాణాలను ఏర్పాటు చేశారు. ఆత్మకూరులోని యస్.ఆర్.జె కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన టపాసులు షాపును ఆర్డీఓ తనీఖీలు చేశారు. కొవిడ్ దృష్ట్యా జాగ్రత్తలు పాటిస్తూ అమ్మకాలు జరుపుకోవాలని సూచించారు.
టపాసులు దుకాణాలను పరిశీలించిన ఆర్డీఓ