నెల్లూరులోని వెంకటేశ్వరపురం దగ్గర విద్యుత్ స్తంభంపై అగ్నిప్రమాదం జరిగింది. కరెంటు స్తంభానికి కేబుల్ వైర్లు చుట్టడంతో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. భారీగా ఎగిసిపడిన మంటలను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విద్యుత్, అగ్నిమాపక అధికారులకు సమాచారమిచ్చి, సకాలంలో మంటలను అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది.
వెంకటేశ్వరపురంలో విద్యుత్ స్తంభంపై ఎగిసిపడ్డ మంటలు - Fire at Nellore Venkateswarapuram
విద్యుత్ స్తంభంపై ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. స్తంభానికి చుట్టిన కేబుల్ వైర్ల వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మంటలను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

వెంకటేశ్వరపురం వద్ద మంటల్లో చిక్కుకున్న విద్యుత్ స్థంభం