నెల్లూరు జిల్లా కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. నలుగురికి గాయాలు.. - నెల్లూరు కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం

05:29 July 29
వెంకట నారాయణ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ కెమికల్ ప్యాక్టరీలో అగ్నిప్రమాదం.. నలుగురికి గాయాలు
నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చంద్రపడియ వద్ద కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. వెంకట నారాయణ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ కెమికల్ ప్యాక్టరీలో తెల్లవారుజూమున 4 గంటల ప్రాంతంలో రియాక్టర్లోని పరికరం పేలింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులకు గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను హఫీజ్, భాస్కర్, రజనీకాంత్, రవిగా గుర్తించారు. బాధితులను నెల్లూరు నారాయణ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సిఉంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనా స్థలాన్ని కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు.
ఇదీ చదవండి:ఈటీవీ-భారత్ కథనానికి ప్రభుత్వం స్పందన.. రష్యా మహిళకు సాయం