నెల్లూరు మైపాడు రోడ్డు దగ్గర బాలాజీ కెమికల్స్‌లో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగింది. భారీగా ఎగిసిపడిన మంటలను అగ్నిమాపక సిబ్బంది రెండు గంటలపాటు శ్రమించి మూడు అగ్నిమాపక యంత్రాలతో అదుపులోకి తెచ్చారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని మంత్రి తెలిపారు.
మైపాడు బాలాజీ కెమికల్స్‌లో అగ్ని ప్రమాదం - మైపాడులో మంత్రి అనిల్‌కుమార్ యాదవ్
నెల్లూరు జిల్లా మైపాడు బాలాజీ కెమికల్స్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. సంఘటనా స్థలాన్ని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ పరిశీలించారు.
మైపాడు బాలాజీ కెమికల్స్‌లో అగ్ని ప్రమాదం