ఆటో షోరూంలో అగ్ని ప్రమాదం... వాహనాలు దగ్ధం - taaza news of nellore
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని ఆటో సర్వీస్ షోరూంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అందులోని వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.
ఆటో షోరూంలో అగ్ని ప్రమాదం... దగ్ధమైన వాహనాలు
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో ఓ ఆటో సర్వీస్ షోరూంలో అగ్ని ప్రమాదం జరిగింది. పొగలు రావడాన్ని గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు తీవ్రంగా శ్రమించి మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే వాహనాలు పూర్తిగా దగ్ధం అయిపోయాయి. సుమారు 10 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని షోరూం నిర్వాహకులు తెలిపారు. విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.