అగ్నిప్రమాదం.. రూ.20 లక్షల ఆస్తి నష్టం - నెల్లూరు జిల్లాలో అగ్ని ప్రమాదం
నెల్లూరు జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. 20 లక్షల రూపాయల నష్టం జరిగింది.
fire
నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడులోని లక్ష్మీ నారాయణ పురం దగ్గర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తానం బాబు అనే వ్యక్తికి చెందిన మంచాలు తయారు చేసే భవనంలో మంటలు చెలరేగాయి. 20 లక్షల రూపాయల విలువైన సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపుచేశారు.