ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వెన్నుపూస విరిగిన వ్యక్తికి ఆర్థిక సాయం - పొట్టేపాళెం పొర్లుకట్టపై వెన్నుపూస విరిగిన వ్యక్తి

చెట్టుమీదనుంచి కిందపడి వెన్నుపూస విరిగిన ఓ వ్యక్తికి ఓ దాతలు సహాయం చేశాడు. ఇంటిని పోషించాల్సిన వ్యక్తే మంచానపడటంతో.. ఆ కుటుంబం వీధినపడింది. నెల్లూరు జిల్లా పొట్టేపాళెం పొర్లుకట్టపై ఓ పేద కుటుంబం అవస్థల గురించి ఈనాడులో కథనం వచ్చింది. దీనిపై స్పందించిన దాతలు వారికి ఆర్థిక సాయం చేశారు.

Financial assistance to  vertebrae fractured person in Nellore
నెల్లూరులో వెన్నుపూస విరిగిన వ్యక్తికి ఆర్థిక సాయం

By

Published : Jun 18, 2020, 5:02 PM IST

నెల్లూరు జిల్లా పొట్టేపాళెం పొర్లుకట్టపై పూరిగుడిసెలో నివాసం ఉంటున్న ఓ కుటుంబానికి దాతలు సహాయం చేశారు. రెండేళ్ల క్రితం చెట్టుపై నుంచి పడి మణి అనే వ్యక్తికి వెన్నుపూస విరిగి.... మంచానికి పరిమితమయ్యాడు. కుటుంబ పెద్ద మంచాన పడడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. భార్య నాగభూషణమ్మ, ఇద్దరు పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అధికారుల చుట్టూ తిరిగినా పింఛన్ మంజూరు కాలేదు. ఈ సమస్యపై ఈనాడులో కథనం ప్రచురితం అయ్యింది. ఆ కథనం చూసి అమెరికాకు చెందిన శివనాయుడు, నవీన్ కుమార్ , శ్రీనివాసులు స్పందించి 30వేల రూపాయలు నగదును వారికి అందజేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details