ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుత్​ కనెక్షన్ల తొలగింపుపై రైతుల ఆగ్రహం - కావలి తాజా వార్తలు

నెల్లూరు జిల్లాలోని సంగం కాలువపై విద్యుత్​ మోటర్ల కనెక్షన్ల తొలగింపునకు వచ్చిన అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగం నుంచి కావలి కాలువ వెళ్తుంది. ఈ కాలువ కింద వేల ఎకరాలను రైతులు సాగు చేస్తుంటారు.

fight between officers and farmers for removing motor connections in kavali
రైతులు. అధికారుల మధ్య వాగ్వాదం

By

Published : Jun 2, 2020, 7:26 PM IST

నెల్లూరు జిల్లాలో కావలి కాలువ కింద ఉండే​ మోటార్ల కనెక్షన్లు తొలగించేందుకు వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నారు. ఈ విషయంలో అధికారులు, రైతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. విద్యుత్​ కనెక్షన్లు తొలగిస్తే ఊరుకోమని రైతులు అధికారులను హెచ్చరించారు. రైతలు అడ్డగింపుతో అధికారులు వెనుదిరిగారు. ఇటీవల రెండో పంటకు అధికారులు సోమశిల జలాశయం నుంచి నీటిని విడుదల చేశారు. రైతులు నారుమడులు సిద్ధం చేసుకున్నాక... చివరికి నీరు అందడం లేదంటూ సంగం పరిసర ప్రాంతాల్లో ఉండే ఏడు గ్రామాల రైతుల మోటర్లను తొలగించేందుకు అధికారులు రావడం వల్ల అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details