నెల్లూరు జిల్లాలో ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ఈ రోజు కూడా భారీ వర్షం కురిసింది. నెల్లూరు, గూడూరు, వాకాడు, కోవూరు, బుచ్చిరెడ్డిపాలెంలో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. పెంచలకోనలో కొండల్లో నుంచి వరద ప్రవాహం పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటికి, వర్షపు నీరు తోడు కావడం చెరువులు నిండాయి. వాగులు వద్ద జల ప్రవాహం ఉద్ధృతంగా ఉంది.
నెల్లూరులో ఎడతెరిపిలేని వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు - నెల్లూరు జిల్లాలో ఈరోజు తాజా వార్తలు
ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయి.
ఎడతెరిపి లేకుండా వర్షాలు పొంగిపొర్లుతున్న వాగులు