నెల్లూరు జిల్లా కోవూరు మండలం లేగుంటపాడులో రైతులకు ఉన్నతాధికారులు.. సాగు విధానాలపై శిక్షణ ఇచ్చారు. రైతులు పండించిన పంటను వారే అమ్ముకునే విధంగా ఉద్యానశాఖ పనిచేస్తుందని జేడీ వెంకటేశ్వరరావు అన్నారు. రైతులతో అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారాలు చేసే విధంగా కృషి చేస్తామని చెప్పారు. స్వయంగా ఎగుమతులు, దిగుమతులు చేసుకునేలా.. ఎరువుల దుకాణాలు నడుపుకునేలా మార్పు తీసుకొస్తామని తెలిపారు. ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. అన్నదాతలను ఉన్నత శిఖరాలకు తీసుకు పోవడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
''వ్యవసాయ రంగ అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం'' - kovuru
రైతులను ఉన్నత శిఖరాలకు తీసుకుపోవటమే ప్రభుత్వ లక్ష్యమని ఉద్యానశాఖ జేడీ వెంకటేశ్వరరావు తెలిపారు.
రైతు శిక్షణ