తిరుపతిలో అమానవీయం.. మృతదేహం తరలింపునకు 108 నిరాకరణ.. బైక్‌పై తీసుకెళ్లిన తండ్రి - రెండేళ్ల చిన్నారి మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లిన తండ్రి
08:26 May 06
ప్రైవేటు అంబులెన్స్‌కు డబ్బుల్లేక బైక్‌పైనే కుమార్తె మృతదేహం తీసుకెళ్లిన తండ్రి
రాష్ట్రంలో వరుసగా అమానవీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మొన్న తిరుపతి రుయా ఆస్పత్రిలో అంబులెన్స్ మాఫియాతో.. మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లగా.. నిన్న నెల్లూరు జిల్లా సంగం ఆస్పత్రిలో మృతదేహం తరలించేందుకు అంబులెన్స్ ఇవ్వడానికి సిబ్బంది నిరాకరించారు. దీంతో కుమారుడి మృతదేహాన్ని తండ్రి బైక్‌పైనే తీసుకెళ్లిన ఘటన జరిగింది. తాజాగా తిరుపతి జిల్లాలో అలాంటి ఘటనే చోటు చేసుకుంది.
Dead body on two wheeler: నిన్న దొరవారిసత్రం మండలం కొత్తపల్లిలో గ్రావెల్ గుంతలో పడి అన్నాచెల్లెలు శ్రవంత్, అక్షయ నీటి మునిగారు. శ్రవంత్‌ను గొర్రెల కాపరి కాపాడగా.. అక్షయ పరిస్థితి విషమించింది. నాయుడుపేట ఆస్పత్రికి తరలించేలోగా చిన్నారి మృతి చెందింది. ఆస్పత్రి నుంచి రెండేళ్ల చిన్నారి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు 108 సిబ్బంది నిరాకరించడంతో.. బాలిక తండ్రి నానా అవస్థలు పడ్డారు. నాయుడుపేట నుంచి మృతదేహం తీసుకెళ్లేందుకు ఆటో డ్రైవర్లు సైతం నిరాకరించడంతో.. బైక్‌పైనే మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు.
ఇదీ చదవండి:
TAGGED:
ap latest news