నెల్లూరు జిల్లాలో పూజల పేరుతో.. కూతురు నోట్లో కుంకమ పోసి, గొంతు నులిమిన ఘటనలో.. బాధిత చిన్నారి (4) ప్రాణాలు కోల్పోయింది. చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందిన చిన్నారి పునర్విక.. పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. కూతురు గొంతు నులిమిన తండ్రి వేణును అదుపులోకి తీసుకున్నారు.
కూతురి నోట్లో కుంకుమ పోసిన ఘటనలో.. చిన్నారి మృతి! - నెల్లూరు జిల్లా తాజా వార్తలు
13:20 June 15
పోలీసుల అదుపులో తండ్రి వేణుగోపాల్
ఇదీ జరిగింది :నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. శాంతి పూజల పేరుతో.. వేణుగోపాల్ అనే వ్యక్తి తన ఇద్దరు కూతుళ్లను దేవుడి ఫొటోల దగ్గర కూర్చోపెట్టి పూజలు జరిపించాడు. ఆ తర్వాత వేణుగోపాల్ తన తల్లిని పిలిచి.. ఒక పాపను ఆమె చేతికి ఇచ్చి బయటకు వెళ్లి కూర్చోమన్నాడు. అనంతరం మరో పాప పునర్విక నోట్లో కుంకుమ పోసి గొంతు నులిమాడు. పాప కేకలతో కుటుంబ సభ్యులు, స్థానికులు పరిగెత్తుకొచ్చి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో.. అక్కడి నుంచి చైన్నై ఆసుపత్రికి తరలించారు.
అపస్మారక స్థితిలోనే నిన్నటి నుంచి చికిత్సపొందిన చిన్నారి పునర్విక.. ఆరోగ్యం మరింత విషమించడంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం నిందితుడు వేణుగోపాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా.. తండ్రి వేణుగోపాల్‌కు మతి స్థిమితం లేదని స్థానికులు చెబుతున్నారు.
ఇవీ చదవండి: