నెల్లూరు నగరంలో ఓ తండ్రి కుటుంబ కలహాలతో తన కొడుకుపైనే కత్తితో దాడి చేశాడు. స్థానిక చంద్రబాబునగర్ ఏ బ్లాక్ వద్ద చిన్నికృష్ణ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతనికి.. కొడుకు రఫీకి మధ్య కొన్నిరోజులుగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన చిన్నికృష్ణ.. కుమారుడు రఫీపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన రఫీని స్థానికులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కుటుంబ కలహాలతో కొడుకుపై కత్తితో తండ్రి దాడి - నెల్లూరు జిల్లా తాజా వార్తలు
కన్నతండ్రే తన కుమారునిపై కత్తితో దాడి చేసిన ఘటన నెల్లూరులో జరిగింది. గత కొంతకాలంగా తండ్రీకొడుకుల మధ్య కుటుంబ కలహాలు నెలకొన్నాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
father Attack on his son with sword at Candrababunagar in nellore district