ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీ రైతు సంఘం నాయకుల ఆందోళన - latest nellore district news

కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన 3 ఆర్డినెన్సులు రైతులకు ఏమాత్రం ఉపయోగపడవని నెల్లూరులోని సీపీఐ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్డినెన్సు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

nellore  district
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకుల ఆందోళన

By

Published : Jun 10, 2020, 7:29 PM IST

నెల్లూరులోని సీపీఐ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు కేంద్రం తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన 3 ఆర్డినెన్సులు రైతులకు ఏమాత్రం ఉపయోగపడవని మండిపడ్డారు. ఈ మూడు చట్టాల వలన రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని వారన్నారు. భారతదేశంలో నూటికి 90 శాతం మంది సన్న, చిన్న కారు రైతులే ఉన్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్డినెన్స్ ప్రకారం పండిన పంటను ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్లి అమ్ముకోవాలని చూసిందని, దీంతో చాలామంది చిన్న, సన్నకారు నష్టపోతారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్డినెన్సులు వ్యాపారులకు మాత్రం ఉపయోగపడతాయే తప్ప, రైతులకు ఏమాత్రం ఉపయోగపడని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్డినెన్సు రద్దు చేయాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details