వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకం అర్హులైన రైతులకు ఏటా 13500 రూపాయలు 2019 సంవత్సరం నుంచి ప్రభుత్వం పెట్టుబడి రాయితీ కింద రైతులకు అందిస్తుందని నెల్లూరు జిల్లా హరేందర్ ప్రసాద్ తెలిపారు. 2020లో మొదటి విడతగా 5,500 ప్రభుత్వం జిల్లాలో 2లక్షల 24వేల 751 మంది రైతులకు ఖాతాలో జమ చేయనున్నారు. మిగిలిన రూ.4000 ఈ నెల 27న రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు.
'రైతు భరోసా పథకం సద్వినియోగం చేసుకోవాలి' - పీఎం కిసాన్ పథకం
వైఎస్ఆర్ రైతు భరోసా పథకం, పీఎం కిసాన్ పథకాలు ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ సూచించారు. మిగిలిన 4 వేలు ఈ నెల 27న రైతు ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు.
'రైతు భరోసా పథకం సద్వినియోగం చేసుకోవాలి'
ప్రతి కుటుంబానికి ఈ పథకం లబ్ధి చేకూర్చడం ప్రభుత్వ లక్ష్యమని అన్నారు కలెక్టర్. రైతు భరోసా కేంద్రంలో గ్రామ సచివాలయంలో రైతు భరోసా లబ్ధి చేకూర్చిన రైతుల పేర్లు నమోదు చేస్తామన్నారు. రైతు భరోసా అందని రైతులు, రైతు భరోసా కేంద్రంలోని గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించాలని సూచించారు. రైతు భరోసా వస్తూ...చనిపోయిన నామిని వివరములు గ్రామ వ్యవసాయ సహాయకులకు అందించాలన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ కోరారు.