నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలోని బిజ్జంపల్లి, బీసీ కాలనీ మార్గంలోని లింగాల వాగుపై వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ రైతులు నిరసన తెలియజేశారు. ప్రవహించే వాగులో నిలబడి నాయ్యం చేయాలని కోరుతూ నినాదాలు చేశారు. కాలనీలో సుమారు 150 కుటుంబాలు దశాబ్దాలుగా జీవనం సాగిస్తున్నారని రైతు సంఘం జిల్లా నాయకుడు వెంకటయ్య అన్నారు. పక్క గ్రామాలకు వెళ్లాలన్నా, విద్యార్థులు చదువుకునేందుకు పాఠశాలకు వెళ్లాలన్నా వాగు దాటవలసి వస్తోందని ఆవేదన చెందారు. వర్షాలు కురిసి వాగు పొంగితే రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంకటయ్య తెలిపారు. పాలకులు ఇప్పటికైనా కళ్లు తెరిచి కాలనీవాసుల కష్టాలను ఆలకించి వంతెనను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నారు.
వంతెన నిర్మించాలని వాగులో రైతుల నిరసన - ఉదయగిరి రైతుల నిరసన
వాగుపై వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. వాగులో నిలబడి నాయ్యం చేయాలని కోరుతూ నినాదాలు చేశారు. వాగు పొంగితే రాకపోకలకు అంతరాయం ఏర్పడి అవస్థలు అనుభవించాల్సి వస్తోందని ఆరోపించారు.

వంచన నిర్మించాలని డిమాండ్ చేస్తూ నిరసన