నెల్లూరులో అఖిల భారత రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో కర్షకులు ధర్నా చేశారు. లాక్ డౌన్ తో రెండు నెలలుగా రైతులు కష్టాలు అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్... రైతులకు ఏమాత్రం ఉపయోగపడలేదని పేర్కొన్నారు. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కష్టాల్లో ఉన్న తమను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకురావడంలేదని మండిపడ్డారు. లాక్ డౌన్ లో నష్టపోయిన రైతులకు పూర్తిగా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా పథకం 18 వేల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు.
'లాక్డౌన్తో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి' - నెల్లూరులో రైతుల ధర్నా
లాక్డౌన్ కారణంగా నష్టపోయిన తమను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. నెల్లూరులో అఖిల భారత రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టారు.
farmers protest