నెల్లూరు జిల్లాలో ధాన్యం పండించిన రైతులు దగాకు గురి అవుతున్నారని భాజపా నాయకులు తీవ్రంగా విమర్శించారు. బుచ్చిరెడ్డిపాలెంలో రోడ్డుపై ధాన్యం పోసి తక్కువ ధరకు విక్రయించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కొనుగోళ్లు చేయడం లేదని నిరసన తెలిపారు.
ధాన్యానికి ధర లేదంటూ రైతుల నిరసన - ధాన్యానికి ధర లేదంటూ రైతులు నిరసన
నెల్లూరు జిల్లాలో ధాన్యం రైతుల పరిస్థితి ధైన్యంగా మారింది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా కొన్ని నిబంధనలతో కొనుగోళ్లు జరగడం లేదు. ఈ పరిస్థితుల్లో రైతులు దళారులకు విక్రయిస్తున్నారు. దళారులు తరుగుతోపాటు ధరను తగ్గిస్తున్నారు. రైతుల కష్టాలను వివరిస్తూ భాజపా ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. బుచ్చిరెడ్డిపాలెం ఎంఆర్వో కార్యాలయం వద్ద ధాన్యం పోసి తక్కువ ధరకు విక్రయించారు.
farmers protest in nellore district
ఇటీవల కురిసిన వర్షాలకు పొలాల్లోనే ధాన్యం తడిసిపోయిందని.. తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని జిల్లా అధికారులు ఇచ్చిన హామీ నెరవేరడం లేదని విమర్శించారు. కొనుగోలు కేంద్రాలు మొక్కుబడిగా ఉన్నాయని. రైస్ మిల్లర్లు సహకరించడం లేదని తెలిపారు. అవకాశంగా తీసుకున్న దళారులు రైతు వద్ద తేమ శాతం పేరుతో తరుగు తీసుకుంటున్నారని.. పుట్టి ధాన్యం 9వేల రూపాయలకు కూడా కొనుగోలు చేయడం లేదని విమర్శించారు.
ఇదీ చదవండి:గొప్ప మేధావిని దేశం కోల్పోయింది: మోదీ