ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సాగుభూమిని తీసుకుంటే ఆత్మహత్యే శరణ్యం' - నెల్లూరు జిల్లా దామరమడుగులో రైతుల నిరసన

ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్న భూమిని ఇప్పుడు ఇళ్ల స్థలాల కోసం అధికారులు తీసుకుంటున్నారని.. అలా చేస్తే తమకు ఆత్మహత్యే శరణ్యమని నెల్లూరు జిల్లా దామరమడుగు రైతులు అన్నారు. పురుగుమందు డబ్బాలతో పొలాల్లో కూర్చుని నిరసన వ్యక్తంచేశారు.

farmers protest in damaramadugu nellore district
పురుగుమందు డబ్బాలతో దామరమడుగు రైతుల ఆందోళన

By

Published : Jun 3, 2020, 1:12 PM IST

సాగు భూములను ఇళ్ల స్థలాలుగా మార్చవద్దని కోరుతూ.. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు రైతులు నిరసన తెలిపారు. పురుగుమందు డబ్బాలతో పొలాల్లో కూర్చుని నిరసన చేపట్టారు. 1977లో పేదలకు సీజేఎఫ్ఎస్ భూములను రైతులకు సాగు కోసం ఇచ్చారు. ఒక్కొక్కరికి 25 సెంట్లు కేటాయించగా.. మొత్తం 42మంది అన్నదాతలు ఆ భూముల్లో పంటలు పండించుకుంటున్నారు.

ఇప్పుడు వాటిని పేదలకు పంచడం కోసం ఇళ్ల స్థలాలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని.. అలా చేస్తే తామేం కావాలంటూ ఆవేదన వ్యక్తంచేశారు. సాగుభూమిని తీసుకుంటే ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే దారి లేదని వాపోయారు.

ఇవీ చదవండి... నాటుసారా కేంద్రాలపై దాడులు... 170 మంది అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details