నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగులో రైతులు నిరసన వ్యక్తం చేశారు. 1977లో సీజేఎఫ్ఎస్ భూములను సాగు చేసుకోవాలని రైతులకు ఇచ్చినట్లు తెలిపారు. అప్పటి నుంచి జాతీయ రహదారి పక్కనే ఉన్న భూములను సాగు చేసుకుంటున్నమన్నారు. అప్పట్లో ఒక్కొక్క రైతుకు 25 సెంట్లు ఇచ్చారని స్పష్టం చేశారు. మొత్తం 42 మంది రైతులకు 12 ఎకరాలు ఇచ్చినట్లు వెల్లడించారు. తమకు భూమి ఇచ్చేస్తే ఎకరాకు ఏడు లక్షల నుంచి 14 లక్షలు వరకు డబ్బులు ఇప్పిస్తామని నాయకులు బెదిరిస్తున్నారని రైతులు ఆరోపించారు.
సాగు భూములు ఇచ్చేది లేదంటూ రైతుల ఆందోళన - నెల్లూరు జిల్లా ఈరోజు తాజా వార్తలు
సాగు భూములను ఇళ్ళ స్ధలాలకు ఇచ్చేది లేదంటు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం రైతులు నిరసన తెలిపారు. డబ్బులు ఇస్తామని భూములు తమకు ఇవ్వాలని నాయకులు బెదిరిస్తున్నారని రైతులు ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సాగు భూములు ఇచ్చేది లేదంటూ రైతుల ఆందోళన