ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బ్రిడ్జి నిర్మించండి మహాప్రభో.. అంటూ అన్న దాతల వినూత్న నిరసన - Protest to build Nellore Farmers Bridge

Farmers Protest For Bridge : ఆ ఊరి రైతన్నలు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అధికారంలో ఉన్న ప్రతి ప్రభుత్వాన్ని తమ గొడను వినిపిస్తున్నారు. కానీ రాజకీయ నాయకులకు, అధికారులకు వినిపించడం లేదు. లేక వినిపించినా వినపడనట్లుగా వ్యవహరిస్తురో తెలియటం లేదు. స్థానిక అధికారులు మాత్రం అర్థం పర్థం లేని సమాధానాలు చెప్తున్నారనీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు కర్షకులకు వచ్చిన కష్టం ఏమిటి?

Etv Bharat
Etv Bharat

By

Published : Mar 3, 2023, 11:43 AM IST

మాకు బ్రిడ్జి నిర్మించండి మహాప్రభో..అన్న దాతల వినూత్న నిరసన

Farmers Protest For Bridge : తీర్చాలి.. తీర్చాలి.. రైతుల కష్టాలు తీర్చాలి. ఇటువంటి నినాదాలు ఇప్పటి నుంచి కాదు స్వాతంత్య్రం రాక ముందు నుంచి వింటూనే ఉన్నాం. స్వాతంత్య్రం వచ్చిన తరువాత రైతుల కష్టాలు తీరుతాయనుకుంటే అది జరగలేదు. అసలు పాలకులకు వారి కష్టాలు వినే తీరికే లేదు. కర్షకుల కష్టాలు నాటి నుంచి నేటి వరకూ తీరనే లేదు. తీరుతాయన్న నమ్మకం కోల్పోయారు రైతన్నలు. ఏదో చిన్న ఆశ తమ గోడును ప్రభుత్వాలకు విసిపిస్తే కరుణిస్తారని.. దేశ వ్యాప్తంగా రైతులు వారి కష్టాలు వినిపిస్తూనే ఉన్నారు. ఆ ఊరి రైతులు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి తమ ధాన్యాన్ని తరలించుకునేందుకు సులువుగా ఉండేందుకు వంతెన నిర్మించాలని ప్రాధేయపడుతూనే ఉన్నారు. కానీ వారి గోడు ఏ ప్రభుత్వానికి వినిపించలేదు. తాజాగా నీళ్లలో నిలబడి నిరసన తెలియజేశారు.

తమ పంట కోత దశకు వచ్చిన తర్వాత ధాన్యాన్ని గ్రామంలోకి తరలించాలంటే ఎంతో కష్టపడాల్సి వస్తుందని నాగులపాడు గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నాగులపాడు గ్రామ రైతులు తమ గ్రామం గుండా పొలాల్లోకి వెళ్లేందుకు కాలువ పై బ్రిడ్జి నిర్మించాలని కాలువలో నడుము లోతులో నిలబడి నిరసనలు తెలిపారు. తమకు పంట వేయడానికి ముందు నుంచి పంట చేతికి వచ్చేంత వరకూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు విలపించారు. తమ గ్రామం గుండా ప్రవహిస్తున్న కాలువపై బ్రిడ్జి లేక పోవడంతో పండిన ధాన్యాన్ని ట్రాక్టర్ల ద్వారా తరలించాలంటే నానా కష్టాలు పడాల్సి వస్తుందని రైతులు ఆవేదన చెందారు. మా గ్రామానికి చెందిన పంట పొలాలు కాలువకి అవతల వేల ఎకరాల్లో పంట పొలాలు, మామిడి తోటలు ఉన్నాయని, కాలువలో పూడిక నిండిపోయిన తీసేవారు లేక రైతులు సొంత నిధులతో జేసీబీని ఏర్పాటు చేసి పూడిక తీయించుకుంటున్నామని అన్నారు. ఈ సందర్భంగా గ్రామ రైతులు మాట్లాడుతూ తమ గ్రామం నుండి ప్రవహిస్తున్న కాలువపై బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్​ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు.

" ఎన్నికల అప్పుడు వేలాది మంది వస్తారు. వచ్చివ ప్రతీ రాజకీయ నాయకుడు బ్రిడ్జి కట్టిస్తామంటారు. ఇప్పటి వరకూ నిర్మించిన దాఖలాలు లేవు. ఒక్కొక్కరు ఒక ట్రిప్పు కంకర వేసి పోతారు. మరొకరు వచ్చి కొలతలు తీసుకొని పోతుంటారు. అధికారులు కూడా సరైన సమాధానాలు చెప్పటం లేదు. అధికారులు మేము ఏమి చేయలేమని అంటున్నారు. " - నాగులపాడు గ్రామ రైతు

" పొలల్లోకి కూలీ వాళ్లను తీసుకొని రావాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. బ్రిడ్డి లేకపోవడం వలన పొల్లాల్లోకి వెళ్లేసరికి సమయం అయిపోతుంది. పని చేసేది ఎప్పుడు. ట్రాక్టర్లు రావటం లేదు. 2 వందల రూపాయలకు వచ్చే ట్రాక్టరు 6 వందలు అయ్యింది. బ్రిడ్జి ఉండింటే డైరెక్టుగా పొలంలోకి వెళ్లేది. " - నాగులపాడు గ్రామ రైతు

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details