ఆరుగాలం శ్రమించి పండించిన పంటను దళారులు, మిల్లర్లు దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ..నెల్లూరు జిల్లా సంగం మండలంలో రైతులు ఆందోళన చేపట్టారు. వరి ధాన్యాన్ని మిల్లర్ల దగ్గరకు తీసుకెళ్తే..అధికారులు అనుమతి ఇవ్వలేదని సాకుతో కొనుగోలు చేయటం లేదని వాపోయారు. దీంతో చేసేదేమీ లేక సంగం తహసీల్దార్ కార్యాలయం ఎదుట పురుగుల ముందుతో ఆందోళనకు దిగారు. అధికారులు స్పందించి సాయంత్రంలోపు ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే..ఆత్మహత్యకు పాల్పడతామని రైతులు బెదిరించారు.
నిలిచిన ధాన్యం కొనుగోళ్లు..రైతుల ఆందోళన - రైతుల ఆందోళన తాజా వార్తలు
నెల్లూరు జిల్లా సంగం మండలంలో రైతులు ఆందోళన బాట పట్టారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను దళారులు, మిల్లర్లు దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
![నిలిచిన ధాన్యం కొనుగోళ్లు..రైతుల ఆందోళన farmers protest at nellore](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11437387-526-11437387-1618651986882.jpg)
నిలిచిన ధాన్యం కొనుగోళ్లు