నెల్లూరు-ముంబై జాతీయ రహదారిపై చుక్కల భూముల రైతులు ఆందోళన చేపట్టారు. చుక్కల భూముల రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి... పట్టాలు ఇవ్వాలంటూ జాతీయ రహదారిపై బైఠాయించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే నెల్లూరు జిల్లా చుక్కల భూముల రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జాతీయ రహదారి కావడంతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని రైతులకు సర్దిచెప్పేందుకు యత్నించినా...వారు వినకపోవడంతో తహసీల్దారు సంఘటనా స్థలానికి చేరుకుని వారంలోగా సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
నెల్లూరు జాతీయ రహదారిపై చుక్కల భూముల రైతుల ఆందోళన - నెల్లూరు జాతీయ రహదారిపై చుక్కల భూముల రైతులు ఆందోళన
నెల్లూరు జిల్లా జాతీయ రహదారిపై చుక్కల భూముల రైతులు ఆందోళన చేపట్టారు. చుక్కల భూముల రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి పట్టాలు ఇవ్వాలంటూ జాతీయ రహదారిపై బైఠాయించి వాహనాలను అడ్డుకున్నారు.
నెల్లూరు జాతీయ రహదారిపై చుక్కల భూముల రైతులు ఆందోళన