ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కప్పేసిన పొగమంచు... బాధపడుతున్న రైతులు - ఆందోళన చెందుతున్న నాయుడుపేట రైతులు

తెల్లవారు జామున ఆకాశాన్ని కప్పిన పొగమంచుతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. ప్రకృతి ప్రేమికులు మాత్రం ఈ అపురూప దృశ్యాలను చూసి పరవశిస్తుండగా... రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. మంచుతో పంటలకు నష్టం వాటిల్లుతుందని దిగులు పడుతున్నారు.

Snow
పొగమంచు

By

Published : Jan 9, 2021, 2:36 PM IST

అకాలంగా కురుస్తున్న భారీ వర్షాలకి తోడు మంచు కూడా ఎక్కువగా కురుస్తుండంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట పరిసర ప్రాంతాల్లో తెలవారుజామున మంచు దుప్పటిలా పరచుకుంది. ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు మంచు కురుస్తుండటంతో పంటలకు చీడపీడల సమస్య ఏర్పడుతోందని అన్నదాతలు భయాందోళన చెందుతున్నారు. రోడ్డు పై వచ్చే వాహనదారులు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారు.

కప్పేసిన పొగమంచు

ABOUT THE AUTHOR

...view details