నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం ద్వారకాపురంలో అటవీ కొండభూముల్లో 200 నుంచి 300 లోతు వరకూ బోర్లు పడవు. భూగర్భజలాలు కాన రాక పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. వర్షం కురిస్తేనే పంటలు పండుతాయి. దీంతో ఈ గ్రామాన్ని కరవు పట్టిపీడిస్తోందనే నానుడి ఉంది. తాజాగా తెలుగుగంగ జలాలు పారడంతో గ్రామస్థులు కొంత చందాలు వేసుకుని... కాల్వలు తవ్వుకుని నీరు వచ్చే లా చేసుకున్నారు. ఈ సీజన్ లో పంట పుష్కలంగా పండుతుందని 220 ఎకరాల్లో వరి సాగుకు శ్రీకారం చుట్టామని .... ఐదు నెలలు పండే జిలకర మసూరి సాగు చేస్తున్నామని రైతన్నలు తెలిపారు . కరవు సీమలో తెలుగుగంగ జలాలతో సిరులు పండిస్తున్నామని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పెరిగిన భూగర్భజలం.. అన్నదాతల్లో వెల్లివిరిసిన ఆనందం - నెల్లూరు రైతుల సంతోషం
కరవు విలయతాండవం చేసే పల్లె అది. ఉపాధి కోసం ప్రజలు పరాయి ప్రాంతాలకు వెళ్తుంటారు. తాగేందుకు నీటి కొరత...ఇక పంటల సాగు ఊసే లేదు . వర్షాలు కురిస్తేనే పంటలు పండటం కష్టం. అలాంటిది ఆ ప్రాంతంలోని చెరువు మార్చి నెల నుంచి నిండుకుండలా మారింది. తెలుగుగంగ జలాలు రావడంతో చెరువులో జలకళ కనిపిస్తోంది. ఎప్పుడూ ఈ సీజన్ లో పంట పొట్ట దశలో ఎండిపోవడం జరిగేది. చెరువు నీటితో ఈసారి పుష్కలంగా పండే అవకాశం ఉంది. పంటల సాగు పనిలో అన్నదాతలు నిమగ్నమై ఉన్నారు.
భూగర్భజలాల పెరగటం కర్షకుల ఆనందం మిన్నంటిది