నెల్లూరు జిల్లాలో ఏడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పశువులు అనేక రోగాల బారిన పడుతున్నాయి. జిల్లాలో 46 మండలాలు ఉన్నాయి. ఒక్కో మండలంలో 4 పశువైద్యశాలలు ఉన్నాయి. వీటి నిర్వహణకు లక్షలాది రూపాయల విలువ చేసే మందులను ప్రభుత్వం పంపిణీ చేస్తున్నారు. వీటిని పశువుల యజమానులకు ఉచితంగా ఇవ్వాల్సి ఉండగా... చాలామంది వైద్యులు దుకాణాల్లో తీసుకువచ్చామని నగదు వసూలు చేస్తున్నారు.
మూగ జీవాలకు మందులు కావాలంటే.. డబ్బులు ఇవ్వాల్సిందే - latest news in nellore
నెల్లూరులో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు అనేక జీవ జాతులు రోగాల బారిన పడుతున్నాయి. లోకం ఎరిగిన మనిషి వైద్యం పొందుతున్నాడు...కానీ నోరు లేని మూగజీవాల పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారింది. వర్షాలు కాస్త తగ్గు ముఖం పట్టడంతో వాటి యజమానులు ప్రభుత్వ పశు వైద్యశాలకు తరలించినప్పటికీ... మందులకు నగదు చెల్లిస్తేనే చికిత్స చేస్తామని వైద్యులు చెబుతున్నారు.
నాయుడుపేట మండలం పండ్లూరు పశు వైద్యశాలలో ప్రసవ వేదనతో ఓ జెర్సీ దూడ మృతి చెందింది. మరో ఘటనలో బూదనం గ్రామానికి చెందిన ఓ రైతు గొర్రెకు శస్త్రచికిత్స చేయించాడు. అక్కడికి రావడానికి ప్రత్యేక ఆటో ఖర్చుతో పాటు...మందులకు కూడా సొమ్ము చెల్లించానని చెబుతున్నాడు. వైద్యుడు ఏడీ వేణుగోపాల్ నెల్లూరు నుంచి రావాల్సి ఉండటంతో ఆదివారం రావటం లేదు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం వరకు విధులు చేపట్టాల్సి ఉన్నా సక్రమంగా పాటించటం లేదని పశు సంరక్షకులు ఆరోపిస్తున్నారు. అంతేగాక మందుల కోసం అధిక సొమ్ము చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు.
ఇదీ చదవండీ...కసరత్తు షురూ..: కొత్త సంవత్సరంలో టీపీసీసీకి నూతన సారథి!