నెల్లూరు జిల్లా మర్రిపాడు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట జిల్లా రైతు సంఘం నాయకులు ములి వెంగయ్య పొగాకు రైతులతో కలిసి నిరసన చేపట్టారు. పొగాకు కొనుగోలు కేంద్రాన్ని తిరిగి ప్రారంభించి రైతులను ఆదుకోవాలని కోరారు. తహసీల్దార్ సుధాకర్‌కు వినతిపత్రం అందించారు. అసలే ధరలేక అల్లాడుతున్న రైతులను కరోనా మహమ్మారి వలన విధించిన లాక్ డౌన్ మరింత ఇబ్బందుల పాలు చేసిందన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే పొగాకు వేలం కేంద్రాలను ప్రారంభించి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.
'పొగాకు వేలం కేంద్రాలను తిరిగి ప్రారంభించాలి' - కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిసిపల్లిలో పొగాకు రైతుల ధర్నా
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డిసిపల్లిలో కరోనా ప్రభావంతో మూతపడ్డ పొగాకు వేలం కేంద్రాన్ని తిరిగి ప్రారంభించి రైతులను ఆదుకోవాలని.. జిల్లా రైతు సంఘం నాయకులు ములి వెంగయ్య కోరారు. మర్రిపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట పొగాకు రైతులతో కలిసి ధర్నా చేపట్టారు.

పొగాకు వేలం కేంద్రాలు ఏర్పాటుచేయాలని రైతుల ధర్నా