ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నీరు లేక కళ్లముందే ఎండిపోతున్న పంటలు - బరువెక్కిన గుండెతో ఆత్మహత్యే శరణం అంటూ రోడ్డెక్కిన రైతన్నలు - Farmers are angry with the officials

Farmers Concerns for Water in Nellore District : నారుమడులు ఎండిపోతున్నాయి, నీళ్లువ్వండి మహాప్రభో అంటూ నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగులవెల్లటూరులో రైతులు ఆందోళన బాటపట్టారు. సాగునీటి అవసరాలు తీర్చాలంటూ రోడ్డుపై బైఠాయించారు. సోమశిల జలాశయం నుంచి దక్షిణ కాలువ ద్వారా నీరు విడుదల చేసేవరకూ ఆందోళన వీడేది లేదన్నారు. ఎండుతున్న వరి నారు, పురుగుల మందు డబ్బాలు చేత పట్టుకొని ఆందోళన నిర్వహించారు.

Farmers Concerns for Water
Farmers Concerns for Water

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 24, 2023, 7:00 PM IST

Updated : Dec 24, 2023, 9:42 PM IST

నీరు లేక కళ్లముందే ఎండిపోతున్న పంటలు - బరువెక్కిన గుండెతో ఆత్మహత్యే శరణం అంటూ రోడ్డెక్కిన రైతన్నలు

Farmers Concerns for Water in Nellore District :ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్లముందే నీరు లేక ఎండిపోతుంటే రైతులు విలవిల పోతున్నారు. తక్షణమేనీరు విడుదల చేయకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమని రైతులు కన్నీళ్లుపెడుతున్నారు. సాగునీటి విడుదల చేయాలంటూ నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగుల వెల్లటూరు రైతులు రోడ్డెక్కారు. సోమశిల జలాశయం నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రహదారిపైనే బైఠాయించారు. ఎండిపోతున్న వరి నారును తీసుకొని వచ్చి నిరసనలు తెలిపారు. నీరు విడుదల చేయకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమని పురుగుల మందు డబ్బాలతో ఆందోళనకు దిగారు.

నీరు అందక ఎండిపోతున్న పంటలు - ఆవేదనతో పశువుల్ని మేపుతున్న రైతులు

చేజర్ల మండలంలోని నాగుల వెల్లటూరు, ఎదనపత్తి, చినగోపవరం, పెదగోపవరం, ఎర్రగుట్లపల్లి గ్రామాల్లో సుమారు పదివేల ఎకరాల్లో వరి నాట్లు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఫలితం లేకనే రోడ్డెక్కామని వాపోయారు. రహదారిపై బైఠాయించి వంట వార్పు చేపట్టడంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. సోమశిల జలాశయం నుంచి సాగునీటి అవసరాల కోసం దక్షిణ కాలువ ద్వారా నీరు విడుదల చేయలని డిమాండ్ చేశారు. నీటిని విడుదల చేసెంతవరకు ఇక్కడ నుంచి కదిలేదీ లేదంటూ ఆందోళనలు చేశారు. అధికారుల నీటిని విడుదల చేయకుంటే తమకు ఆత్మహత్యే శరణం అంటూ పురుగుల మందు డబ్బాలతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నీరులేక పొలంలో ఎండుతున్న వరి నారును చూపించి వాపోయారు. వెంటనే దక్షిణ కాలువకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.


అకాల వర్షాలతో అన్నదాతలకు కన్నీరు - ఆదుకోవాలని విన్నపం


Farmers Protest in Chejerla : చేజర్ల మండలంలో ఉన్న నాగుల వెల్లటూరు, ఎదనపత్తి, చినగోపవరం, పెదగోపవరం, లలితా నగర్, ఎర్రగుట్లపల్లి, గ్రామాలలో సుమారు పదివేల ఎకరాలు అధికారుల ఆదేశాల మేరకు వరి నాట్లు వేశామని రైతులు తెలిపారు. కానీ వరి నాట్లు వేశాక ఐఏబి సమావేశంలో ఆయా గ్రామాలకు నీటి కేటాయింపులు చేయకపోవడంతో నీరు వదలడం కుదరదు అంటూ అధికారులు మొహం చాటేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఐదు గ్రామాలు టీడీపీ సానుభూతి పరులు కావడంతో ఈ గ్రామాలకు నీళ్లు తరలించేందుకు ప్రజాప్రతినిధులు విముఖత చూపుతున్నరని రైతులు తెలిపారు. తము నాయకులను వెళ్లి కలిసినప్పుడు నీరు వదలతామని చెప్పి, అధికారులకు మాత్రం వదలోద్దని చెబుతున్నారని రైతులు ఆరోపింస్తున్నారు. చేజర్ల మండలం కూసంత దూరంలోనే జలశయం ఉందని, అయినా, ఈ గ్రామాలకు నీటిని విడుదల చేయకుండా దిగువ గ్రామాలకు నీటిని విడుదల చేస్తున్నారని మండిపడ్డారు. తాము చేసిన తప్పేంటని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అందని సాగు నీళ్లు.. పంటకు తెగుళ్లు.. మిర్చి రైతు కన్నీళ్లు

Last Updated : Dec 24, 2023, 9:42 PM IST

ABOUT THE AUTHOR

...view details