Power Cuts In Nellore: నెల్లూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎడాపెడా కరెంట్ కోతలతో రైతులు అల్లాడుతున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు కోతలతో...పంటలు తడిపేందుకు 24 గంటలూ మీటరు వైపే చూడాల్సి వస్తోంది. ఇందుకూరుపేట, సర్వేపల్లి, వెంకటాచలం, బోగోలు, వరికుంటపాడు వరకూ అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి.
తడిసిన చోటే మళ్లీ: ఉదయగిరి, ఆత్మకూరు ప్రాంతాల్లో మెట్టపైర్లు ఉన్నాయి. పొదలకూరు ప్రాంతాల్లో రైతులు నిమ్మతోటలు సాగుచేస్తున్నారు. ఎకరా తడవాలంటే కనీసం ఆరుగంటలు ఏకదాటిగా విద్యుత్ మోటార్లు పనిచేయాలి. అయితే వేళాపాళాలేని కరెంట్ కోతలతో.....పంట తడిసిన చోటే మళ్లీ తడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఛార్జీల పెంపుతో బాదితే బాదారు...కనీసం కోతల్లేకుండా పని చేసుకోనివ్వాలని రైతులు అంటున్నారు.