ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అప్పుల బాధలతో రైతు ఆత్మహత్యాయత్నం - సోమశీల జలాశయం దిగువ పొలాలు

అప్పుల బాధతో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు. చేతికి అందిన పంట పదిరోజుల వ్యవధిలోనే మూడు సార్లు నీట మునగడంతో మనస్థాపానికి గురయ్యాడు. అన్నదాతకు దిక్కుతోచని పరిస్థితి కల్పించిన ఈ ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది.

farmer suicide attempted
రైతు ఆత్మహత్యాయత్నం

By

Published : Oct 6, 2020, 12:56 PM IST

నెల్లూరు జిల్లా సంగం మండలం కోరిమెల్లలో ఓ రైతు అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంకటరత్నం అనే రైతు రూ.20లక్షలు అప్పు తెచ్చి, 37ఎకరాల సొంత పొలం, పది ఎకరాల కౌలు పొలంలో వరి నాటాడు. పంట మరో పదిహేను రోజుల్లో కోతకు వస్తుందనగా సోమశీల జలాశయానికి భారీగా వరద చేరింది. దాంతో అధికారులు నీటిని దిగువకు వదిలారు. కోతకు వచ్చిన పంట అంతా తడిసి మొలకలు వచ్చాయి. అప్పు చేసి వేసిన పంట దేనికి పనికి రాకుండా పోవడంతో రైతు మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో నెల్లూరు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

రైతు ఆత్మహత్యాయత్నం

ABOUT THE AUTHOR

...view details