నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన రైతు వెంకట సుబ్బయ్య తన పొలానికి మార్గం చూపాలని గత పదేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. అధికార పార్టీ అండతో వైకాపా నేత తన పొలానికి వెళ్లేందుకు దారి లేకుండా అడ్డుగా కంచె వేశాడని వాపోయాడు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా తిరిగి తననే వేధిస్తున్నారని ఆరోపించాడు. తనకు న్యాయం జరగడం లేదనే మనస్తాపంతో కుటుంబంతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ఎదుటే ఉరి వేసుకుని చనిపోయేందుకు యత్నించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. బాధితులను అడ్డుకొని ఆత్మకూరు ఆర్డీవో కార్యాలయానికి తరలించారు. బీడు భూమిగా మారిపోతున్న తన పొలానికి దారి చూపి.. తనకు న్యాయం చేయాలని సుబ్బయ్య వేడుకుంటున్నాడు.
తహసీల్దార్ ఎదుట కుటుంబంతో కలిసి రైతు ఆత్మహత్యాయత్నం - నెల్లూరులో రైతు కుటుంబంతో కలిసి ఆత్మహత్యాయత్నం వార్తలు
తన పొలంలోకి వెళ్లే మార్గంలో వైకాపా నేతలు కంచె వేశారని.. దానిపై చర్యలు తీసుకోవాలని అధికారులను వేడుకుంటున్నప్పటికీ ఫలితం లేదని ఆరోపిస్తూ ఓ రైతు కుటుంబంతో ఆత్మహత్యకు యత్నించాడు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కృష్ణాపురంలో జరిగిన ఘటన వివరాలివి..!
తహసీల్దార్ కార్యాలయం ఎదుట కుటుంబంతో కలిసి రైతు ఆత్మహత్యాయత్నం
TAGGED:
నెల్లూరు జిల్లా తాజా వార్తలు