FARMER SUICIDE ATTEMPT: నెల్లూరు జిల్లా కొండాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట పైడి దిబ్బయ్య అనే రైతు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కొందరు దళారులు తనను మోసం చేశారని ఆవేదనతో కొండాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట పురుగు మందు తాగాడు. వెంటనే స్థానికులు దిబ్బయ్యను కలిగిరి ఆసుపత్రికి తరలించారు. తన పొలాన్ని ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులను కోరాడు.
తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం - nellore district news
FARMER SUICIDE ATTEMPT: తహసీల్దార్ కార్యాలయం ఎదుటే పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. తన పొలాన్ని ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులను అడిగినా పట్టించుకోక పోవడంతో దళారులను ఆశ్రయించి తన సమస్యను పరిష్కరించుకోవాలనుకున్నాడు. కానీ వాళ్లు కూడా మోసం చేయడంతో ఆవేదనకు గురయ్యాడు.
farmer suicide attempt