ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్రామ సచివాలయంలో రైతు ఆత్మహత్యాయత్నం - farmer atmahayta at nellore news

తన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందేమోనని మనస్థాపానికి గురైన ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గ్రామ సచివాలయంలోనే పురుగుల మందు తాగి ఆస్పత్రి పాలయ్యాడు.

farmer-suicide-attempt-at-nellore-district
రైతు ఆత్మహత్యాయత్నం

By

Published : Dec 14, 2019, 7:17 AM IST

గ్రామ సచివాలయంలో రైతు ఆత్మహత్యాయత్నం

ఏళ్ల తరబడి సాగుచేసుకుంటున్న భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోందని నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని మిక్కిలింపేట గ్రామానికి చెందిన సుమంత్ కుమార్​ రెడ్డి అనే రైతు మనస్థాపానికి గురై ఆత్మహత్యకు యత్నించాడు. గ్రామంలోని 921, 928, 929 సర్వే నంబర్లలో 6.18 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిలో కొంతమంది రైతులు ఏళ్ల తరబడి పంటలు సాగు చేసుకుంటున్నారు. సుమంత్ రెడ్డి ఎకరా పొలం కొనుగోలు చేసి గత పదేళ్లుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు ఇది ప్రభుత్వం భూమంటూ అధికారులు బోర్డు పెట్టడం, కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో సుమంత్ రెడ్డి మనస్థాపానికి గురయ్యారు. శుక్రవారం మిక్కిలింపేట గ్రామ సచివాలయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన సుమంత్ కుమార్ రెడ్డిని... స్థానికులు నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. భూమి రిజిస్ట్రేషన్ కూడా అయిందని, పాస్ బుక్​ను సైతం అధికారులు జారీ చేసినట్లు... బాధితుడి బంధువులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details