నెల్లూరు జిల్లాలో పరీక్షలు నిర్వహించిన వారిలో 40 శాతానికి పైగా ప్రజలకు కరోనా పాజిటివ్ రావడం దురదృష్టకరమని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం జిల్లాలో అత్యవసర ఆరోగ్య పరిస్థితి ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. కొవిడ్ పట్ల ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరించడం లేదని ఆయన మండిపడ్డారు.
జిల్లాలో అత్యవసర ఆరోగ్య పరిస్థితి ప్రకటించాలి : సోమిరెడ్డి
నెల్లూరు జిల్లాలో కరోనా ఉద్ధృతి పెరగడం ఆందోళన కలిగిస్తోందని మాజీమంత్రి సోమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో అత్యవసర ఆరోగ్య పరిస్థితి ప్రకటించాలని డిమాండ్ చేశారు.
మాజీమంత్రి సోమిరెడ్డి